Rakhi Sawant: రాఖీ సావంత్ పై రూ. 10 కోట్ల దావా వేసిన తనుశ్రీ దత్తా!

  • 'మీటూ' ఉద్యమాన్ని మరో స్థాయికి తీసుకెళ్లిన తనుశ్రీ దత్తా
  • ఆమెకు పిచ్చి పట్టిందన్న రాఖీ సావంత్
  • అవకాశాలు లేకనే వ్యాఖ్యలని మండిపాటు

బాలీవుడ్ నటుడు నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలు చేసి, ఇండియాలో 'మీటూ' ఉద్యమాన్ని మరో స్థాయికి తీసుకెళ్లిన తనుశ్రీ దత్తా, ఇప్పుడు రాఖీ సావంత్ పై రూ. 10 కోట్లకు దావా వేసింది. తనుశ్రీకి పిచ్చి పట్టిందని, పదేళ్ల పాటు కోమాలో ఉన్న ఆమె, ఇప్పుడే బయటకు వచ్చి లేనిపోని ఆరోపణలు చేస్తోందని రాఖీ సావంత్ ఆరోపించిన సంగతి తెలిసిందే. తనకు అవకాశాలు లేకపోవడంతో, డబ్బు కోసమే ఆమె ఈ వ్యాఖ్యలు చేస్తోందని, నానా పటేకర్, గణేష్ ఆచార్య తదితరులు మంచివారని కూడా అంది. రాఖీ సావంత్ వ్యాఖ్యలపై మండిపడిన తనుశ్రీ, తన పరువుకు నష్టం కలిగించేలా ఆమె మాట్లాడిందని ఆరోపిస్తూ ఈ దావా వేసింది. ఇక ఈ వివాదం ఎంతవరకూ వెళుతుందో వేచి చూడాలి.

Rakhi Sawant
Tanusri Dutta
MeToo India
  • Loading...

More Telugu News