Chandrababu: అలా చేస్తే చంద్రబాబు విజయాన్ని అడ్డుకోవడం దేవుడికి కూడా సాధ్యం కాదు: జేసీ

  • 40 శాతం మంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత
  • వారిని మార్చగలితే చంద్రబాబును ఎవరూ ఆపలేరు
  • జగన్, పవన్ భిన్న ధ్రువాలు

టీడీపీ ఎమ్మెల్యేల్లో 35-40 శాతం మందిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, వచ్చే ఎన్నికల్లో వారిని కనుక మార్చగలిగితే చంద్రబాబు గెలుపును ఆ దేవుడు కూడా అడ్డుకోలేడని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబుపై ప్రజల్లో కాస్తంతైనా వ్యతిరేకత లేదని పేర్కొన్నారు. తానెప్పుడూ ఏ ఎమ్మెల్యేపైనా చంద్రబాబుకు ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. మంచి ఎమ్మెల్యేలను, ఎంపీలను తెచ్చిపెట్టుకుంటే మళ్లీ చంద్రబాబే సీఎం అని తేల్చి చెప్పారు.

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌, వైసీపీ అధినేత జగన్‌పైనా జేసీ మాట్లాడారు. వారిద్దరూ రాష్ట్రంలో ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుస్తారని, అయితే, వారు నిలబెట్టిన అభ్యర్థులు గెలుస్తారని చెబితే కనుక, అది అబద్ధం చెప్పడమే అవుతుందని జేసీ వ్యాఖ్యానించారు. జగన్, పవన్ ఇద్దరూ భిన్న ధ్రువాల్లాంటి వారని, వారిద్దరూ కలిసి పనిచేస్తారని తాను అనుకోవడం లేదన్నారు.  

Chandrababu
Andhra Pradesh
Anantapur District
MP
JC Diwakar Reddy
MLAs
MPs
  • Loading...

More Telugu News