Amruthsar: 'అమృత్‌సర్’ ఘటనను కావాలనే నాకు అంటగడుతున్నారు!: కన్నీళ్లు పెట్టుకున్న కార్యక్రమ నిర్వాహకుడు

  • పట్టాలపై నిలబడొద్దని పది సార్లైనా హెచ్చరించా
  • రావణ దహన కార్యక్రమం కోసం అనుమతి తీసుకున్నా
  • నేను ఏ తప్పూ చేయలేదు

అమృత్‌సర్‌లో రావణ దహన కార్యక్రమం కోసం అనుమతి తీసుకున్నానని.. వేడుక చూసేందుకు వచ్చిన వారిని పట్టాలపై నిలబడొద్దని కనీసం పది సార్లైనా హెచ్చరించానని రావణ దహన నిర్వాహకుడు, స్థానిక కౌన్సిలర్ కుమారుడు సౌరభ్ మదన్ మిత్తూ పేర్కొన్నాడు. ఈ కార్యక్రమం సందర్భంగా అమృత్‌సర్‌లో ప్రజలపైనుంచి రైలు దూసుకుపోవడంతో 62 మంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. నాటి నుంచి సౌరభ్ పరారీలో ఉన్నాడు.

తాజాగా గుర్తు తెలియని ప్రాంతం నుంచి ఓ వీడియోను రికార్డు చేసి, పోస్ట్ చేసిన సౌరభ్.. తాను ఏ తప్పూ చేయలేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని.. కొందరు కావాలని ఘటనను తనపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని వీడియోలో వాపోయాడు. 

  • Loading...

More Telugu News