Ram charan: నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది చరణ్ అన్నా: మంచు మనోజ్

  • శ్రీకాకుళంలోని గ్రామాన్ని దత్తత తీసుకున్న చెర్రీ
  • ట్విట్టర్ ద్వారా స్పందించిన మంచు వారబ్బాయి 
  • అంతా మన నుంచే మొదలవ్వాలన్న మనోజ్ 

తన బాబాయి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపు మేరకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శ్రీకాకుళం జిల్లాలోని ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవడానికి సిద్ధపడిన విషయం తెలిసిందే. దీనిపై చెర్రీపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా హీరో మంచు మనోజ్ కూడా స్పందించాడు. ట్విట్టర్ ద్వారా చెర్రీని ప్రశంసించాడు.

దత్తత తీసుకునేలా ప్రోత్సహించిన పవన్ కల్యాణ్‌కి ధన్యవాదాలు తెలిపాడు. ‘‘అంతా మన నుంచే మొదలవ్వాలి.. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అన్నా. గొప్ప కార్యక్రమం చేపట్టారు. ఇలాంటి పనిని చేపట్టేందుకు రామ్‌ చరణ్‌కు స్ఫూర్తి కలిగించిన పవన్ కల్యాణ్ గారికి ధన్యవాదాలు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం చాలా మంచి పని’’ అంటూ మనోజ్ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

Ram charan
Pavan Kalyan
Manchu Manoj
Srikakulam District
  • Loading...

More Telugu News