jagan: మీ అమ్మను తిట్టిన బొత్సను సిగ్గులేకుండా పార్టీలో చేర్చుకున్నారు: జగన్ పై సుజయకృష్ణ ఫైర్

  • బొత్స కుటుంబం పార్టీలోకి వస్తే నేను రానని ముందే చెప్పా
  • మేము భూములు తీసుకున్నామనే ఆరోపణలు నిరూపించాలి
  • అశోక్ గజపతిరాజుతో కలసి జిల్లా అభివృద్ధి కోసం పని చేస్తున్నాం

వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి సుజయకృష్ణ రంగారావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను వైసీపీలో చేరినప్పుడే... బొత్స కుటుంబం పార్టీలోకి వస్తే, తాను రానని జగన్ కు చెప్పానని అన్నారు. మీ తల్లిని తిట్టిన బొత్సను సిగ్గులేకుండా పార్టీలో ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు. తాము అక్రమంగా భూములు తీసుకున్నామనే ఆరోపణలను జగన్ నిరూపించాలని, లేకపోతే జిల్లా దాటక ముందే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే జగన్ ను ప్రజలు నమ్మరని అన్నారు. విజయనగరం జిల్లా అభివృద్ధి కోసం అశోక్ గజపతిరాజుతో కలసి పని చేస్తున్నామని చెప్పారు. 

jagan
botsa
sujaya krishna ranga rao
ashok gajapathi raju
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News