Nellore District: నెల్లూరు జిల్లా జ్వాలాముఖి ఆలయంలో అర్ధరాత్రి మహిళ ప్రదక్షిణలు.. అమ్మవారేనంటున్న భక్తులు!

  • ఆత్మకూరు పట్టణంలో ఘటన
  • వీడియో చిత్రీకరించిన యువకులు
  • స్వయంగా అమ్మవారేనంటున్న స్థానికులు

నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో ఉన్న జ్వాలాముఖి అమ్మవారి ఆలయంలో శరన్నవ రాత్రి వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా పలువురు అమ్మవారిని దర్శంచుకున్నారు. అయితే ఆలయం మూసివేసిన తర్వాత ఓ మహిళ పసుపు రంగు దుస్తులు ధరించి అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. తనకు కూడా గజ్జెల శబ్దాలు వినిపించాయని ఆలయ పూజారి కృష్ణ ప్రసాద్‌ తెలిపారు. దుర్గాష్టమి నుంచి ఇలా ఓ మహిళ అమ్మవారికి ప్రదక్షిణలు చేస్తోందని స్థానికులు చెబుతున్నారు.

కాగా అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న మహిళ వీడియోను కొందరు యువకులు తమ ఫోన్లలో చిత్రీకరించారు. దీంతో పలువురు మీడియా ప్రతినిధులు అక్కడకు చేరుకున్నారు. ఆలయంలో ప్రదక్షిణలు చేస్తున్నది అమ్మవారేనని పలువురు స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు మాత్రం ఎవరో మహిళే ఇలా ప్రదక్షిణలు చేస్తోందని చెబుతున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News