Balakrishna: హీరోయిన్ పూజా హెగ్డేను వర్ణించిన బాలయ్యపై సెటైర్లు!

  • నిన్న 'అరవింద సమేత' విజయోత్సవ సభ
  • పూజా హెగ్డే అందాన్ని హిందీలో వర్ణించిన బాలయ్య
  • అర్థం కావడం లేదంటూ నెటిజన్ల సెటైర్లు

"లగ్తాహై ఆస్మాన్‌ సే ఫరిస్తా ఉతర్‌ కే సంగ్‌మే మరమరాన్‌ మే బనాలేంగే.. హర్‌ ఖలీ మస్తే .. పత్తీ పత్తీ గులాబ్‌ హోజాతీ హై"...
నిన్న రాత్రి 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రం విజయోత్సవ వేడుక హైదరాబాద్ లో వైభవంగా జరిగిన వేళ, సినిమా హీరోయిన్ పూజా హెగ్డే, అందాన్ని పొగడుతూ, ఆమెపై ప్రశంసలు కురిపిస్తూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలివి. అవకాశం దొరికినప్పుడల్లా తనలోని భాషా చాతుర్యాన్ని ప్రదర్శించి ఆకట్టుకునే బాలయ్య, ఈ దఫా మాట్లాడిన మాటలపై మాత్రం నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

ఆయన ఏమన్నారో తమకు అర్థం కావడం లేదంటూ, "ఈ భాషాకో తెల్గూమే బోలే మేధావుల్‌ హైతే.. నాకు సమఝ్‌ అయ్యేలా బోలండి ప్లీజ్‌" అని ఒకరు, "అమ్మాయిలను పడేయాలంటే బాలయ్య దగ్గర ట్యూషన్‌ కు వెళ్లాల్సిందేనంటూ" మరొకరు సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. పలువురు తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ, బాలయ్య మాటల వీడియోను జతచేసి వైరల్ చేస్తున్నారు. ఆ వీడియోను మీరూ చూడండి.

Balakrishna
Pooja Hegde
Aravinda Sametha
Hindi
Social Media
  • Error fetching data: Network response was not ok

More Telugu News