Manchu Manoj: సినిమాలకు విరామం... రాజకీయాల్లోకి మంచు మనోజ్!

  • అభిమానులకు లేఖ రాసిన మనోజ్
  • తిరుపతి నుంచి సరికొత్త ప్రయాణం
  • తెలంగాణలోనూ సాగుతుందన్న మనోజ్

సినిమాలకు కొంతకాలం విరామం ఇచ్చి, రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని మోహన్ బాబు వారసుడు మంచు మనోజ్ భావిస్తున్నారా? సోషల్ మీడియాలో ఆయన ఓ లేఖను విడుదల చేయడం, అందులోని వ్యాఖ్యలను చూడటంతో, మనోజ్ మనసులో రాజకీయాలు ఉన్నాయని అంటున్నారు నెటిజన్లు. సినిమాలే తనకు ప్రపంచం కాదని, ప్రజలకు చేతనైన సాయం చేయాలని ఉందని, తనకెంతో ఇష్టమైన తిరుపతి నుంచే ప్రయాణం ప్రారంభమవుతుందని చెబుతూ ఓ లేఖను ఆయన పోస్ట్ చేశాడు.

గమ్యం లేని లక్ష్యాలు ఎన్నిటికైనా మనశ్శాంతిని దూరం చేస్తాయని వ్యాఖ్యానించిన ఆయన, మన లక్ష్యం చుట్టూ ఉన్న ప్రజలను ఉద్ధరించేలా ఉండాలని తన లేఖలో చెప్పాడు. తిరుపతికి వచ్చి, ఇక్కడి గాలిని పీల్చితే, ఏదో తెలియని శక్తి తనను ఆవహిస్తుందని, ఇక్కడి రైతుల పిల్లల విద్యకు సహాయం చేస్తానని చెప్పాడు. తన సరికొత్త ప్రయాణం కేవలం రాయలసీమకు మాత్రమే పరిమితం కాదని, ఏపీ, తెలంగాణల్లోనూ సాగుతుందని పేర్కొన్నాడు. మంచు మనోజ్ రాసిన లేఖను మీరూ చూడవచ్చు.

Manchu Manoj
Politics
Andhra Pradesh
Telangana
Rayalaseema
Tirupati
  • Loading...

More Telugu News