Rohit Sharma: సచిన్ రికార్డును అధిగమించిన రోహిత్ శర్మ

  • విండీస్‌తో వన్డేలో రెచ్చిపోయిన రోహిత్
  • 152 పరుగులతో విధ్వంసం
  • సచిన్ రికార్డు బద్దలు

టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గువాహటిలో విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన రోహిత్ 152 పరుగులు చేశాడు. 117 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 15 ఫోర్లు 8 సిక్సర్లతో 150 పైచిలుకు పరుగులు సాధించాడు. తద్వారా వన్డేల్లో ఎక్కువసార్లు 150కిపైగా పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు.

 టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 5 సార్లు 150కిపైగా పరుగులు సాధించాడు. రోహిత్ ఆరుసార్లు ఆ ఘనత సాధించి సచిన్ రికార్డును బద్దలుగొట్టాడు. ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ కూడా ఐదుసార్లు 150కిపైగా పరుగులు సాధించాడు. కాగా, వన్డేల్లో రోహిత్ అత్యధిక స్కోరు 264 పరుగులు కావడం విశేషం.

Rohit Sharma
Sachin Tendulkar
Windies
Team India
Guwahati
  • Loading...

More Telugu News