elephant: ఇంట్లోకి దూరి బియ్యం, ఎరువును తినేసిన ఏనుగు.. వీడియో చూడండి

  • కోయంబత్తూరు సమీపంలోని గ్రామానికి వచ్చిన ఏనుగు
  • దాన్ని తరమడానికి నానా తంటాలు పడ్డ గ్రామస్తులు
  • గత ఏడాది కూడా పలుమార్లు గ్రామాల్లోకి వచ్చిన ఏనుగులు

ఆహారం వెతుక్కుంటూ వచ్చిన ఓ ఏనుగు ఇంట్లోకి ప్రవేశించింది. అక్కడ ఉన్న బియ్యంతో పాటు ఎరువును కూడా స్వాహా చేసేసింది. ఈ ఆసక్తికర సన్నివేశం కోయంబత్తూరు సమీపంలోని తాండగంలో చోటుచేసుకుంది. ఏనుగు వచ్చిందన్న వార్తతో గ్రామస్తులంతా అక్కడకు చేరుకున్నారు. ఏనుగును అక్కడ నుంచి తరమడానికి వారు నానా తంటాలు పడ్డారు. వాళ్లు ఎంతో ప్రయత్నించిన తర్వాత... అక్కడి నుంచి గజరాజు వెళ్లిపోయింది. ఎవరికీ ఏనుగు ఎలాంటి హాని చేయకపోవడం గమనార్హం. ఆహారం కోసం ఏనుగులు గ్రామంలోకి రావడం ఇదే తొలి సారి. కోయంబత్తూరు పరిసర ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు గత ఏడాది చాలానే చోటుచేసుకున్నాయి.

elephant
house
rice
coimbathore
  • Error fetching data: Network response was not ok

More Telugu News