Deepika Padukone: బాలీవుడ్ లో మరో ప్రేమ పెళ్లి.. వెడ్డింగ్ డేట్ ను ప్రకటించిన దీపికా, రణవీర్

  • నవంబర్ 14, 15 తేదీల్లో పెళ్లి
  • సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన ప్రేమ జంట
  • అందరి దీవెనలు కావాలని కోరిన దీపికా, రణవీర్

బాలీవుడ్ ప్రేమ జంట దీపికా పదుకునే, రణవీర్ సింగ్ లు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. నవంబర్ 14, 15 తేదీల్లో వీరి వివాహ వేడుక జరగనుంది. ఈ విషయాన్ని దీపికా, రణవీర్ లు అఫీషియల్ గా ప్రకటించారు. ఈ మేరకు వారు సోషల్ మీడియా ద్వారా ఓ ప్రకటనను విడుదల చేశారు.

'మా కుటుంబసభ్యుల దీవెనలతో నవంబర్ 14, 15 తేదీల్లో మా వివాహ వేడుక జరగనుందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. గత కొన్నేళ్లుగా మాపై మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానాలకు ధన్యవాదాలు. మేమిద్దరం పెళ్లితో ఒకటవబోతున్నాం. ఈ సందర్భంగా మీ దీవెనలను కోరుకుంటున్నాం' అంటూ తమ ప్రకటనలో తెలిపారు. చాలా కాలంగా వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ పెళ్లాడబోతున్నట్టు గత కొన్ని నెలలుగా అనేక కథనాలు వెలువడ్డాయి. చివరకు వీరిద్దరూ తమ పెళ్లి గురించి అధికారికంగా ప్రకటించారు.

Deepika Padukone
ranveer singh
marriage
date
bollywood
  • Loading...

More Telugu News