junior ntr: గిఫ్ట్ పంపిన నారా బ్రాహ్మణి.. ఉద్వేగానికి లోనైన జూనియర్ ఎన్టీఆర్

  • తారక్ పై ప్రశంసలు కురిపించిన బ్రాహ్మణి
  • హరికృష్ణ పాత ఫొటోలతో కూడిన సీడీని గిఫ్ట్ గా పంపిన వైనం
  • కృతజ్ఞతలు తెలిపిన తారక్

జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' చిత్రం బాక్సాఫీసును కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. నాన్ బాహుబలి చిత్రాల రికార్డులను ఈ చిత్రం చెరిపేసింది. ఈ రోజు ఈ సినిమా సక్సెస్ మీట్ కూడా జరగనుంది. ఈ కార్యక్రమానికి బాలయ్య ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. మరోవైపు, ఈ సినిమాను చూసిన బాలయ్య కుమార్తె, నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి... తన అన్నయ్య తారక్ పై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ఒక సర్ ప్రైజ్ గిఫ్ట్ కూడా పంపారు.

ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మరణించిన తన పెదనాన్న హరికృష్ణ పాత ఫొటోలను సేకరించి, వాటిని ఆల్బమ్ గా చేయించి, సీడీ రూపంలో ఎన్టీఆర్ కు బ్రాహ్మణి పంపించారు. ఆ ఫొటోలను చూసిన తారక్ ఉద్వేగానికి లోనయ్యాడు. చెల్లెలు బ్రాహ్మణికి కృతజ్ఞతలు తెలిపాడు.

junior ntr
tarak
nara brahmani
gift
aravinda sametha
  • Loading...

More Telugu News