gudimalla ravikumar: మేం అంటరానివాళ్లం కాదన్న విషయాన్ని కేసీఆర్ గుర్తించాలి: టీఆర్ఎస్ నేత రవికుమార్

  • బయట నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన వారు గ్రూపులుగా తయారవుతున్నారు
  • పార్టీ కోసం కష్టపడిన వారు బాధపడుతున్నారు
  • పార్టీలో కాని, ప్రభుత్వంలో కాని మాకు పదవులు లేవు

తెలంగాణ ఉద్యమకారులపై టీఆర్ఎస్ పార్టీలో దాడి జరుగుతోందని ఆ పార్టీ సీనియర్ నేత గుడిమల్ల రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. బయట నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన వారు... గ్రూపులుగా తయారవుతున్నారని మండిపడ్డారు. ఉద్యమకారులను అవమానిస్తే పార్టీని అవమానించినట్టేనని చెప్పారు. పార్టీ కోసం కష్టపడిన వారు బాధపడుతున్నారని తెలిపారు. పార్టీలో కాని, ప్రభుత్వంలో కాని తమకు ఎలాంటి పదవులు లేవనే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించాలని కోరారు. తాము అంటరానివారం కాదన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలని చెప్పారు.

మరోవైపు, వరంగల్ తూర్పు టీఆర్ఎస్ టికెట్ ను రవికుమార్ ఆశిస్తున్నారు. అయితే వేరే వ్యక్తికి ఈ టికెట్ ను కేటాయిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన పైవ్యాఖ్యలు చేశారు.

gudimalla ravikumar
warangal
kcr
TRS
ticket
  • Loading...

More Telugu News