East Godavari District: షటిల్ ఆడుతూ కాలుజారి బోర్లా పడ్డ ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప... వీడియో చూడండి!

  • కాకినాడ, రాజా ట్యాంక్ ఆవరణలో షటిల్‌ కోర్టు
  • ప్రారంభించేందుకు వచ్చిన చినరాజప్ప
  • షటిల్ ఆడుతూ కాలుజారి పడ్డ నేత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి షటిల్ ఆడుతూ ఓ షాట్ కొట్టబోయి, కాలుజారి బోర్లా పడిన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో రాజా ట్యాంక్ ఆవరణలో షటిల్‌ కోర్టును ప్రారంభించిన ఆయన, ఆపై కాసేపు షటిల్ ఆడుదామని ప్రయత్నించిన వేళ ఈ ఘటన జరిగింది.

చినరాజప్ప, కాలు జారి పడిపోయిన వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది, పక్కనే ఉన్న తెలుగుదేశం నేతలు ఆయనను పైకి లేవదీశారు. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలు అయ్యాయి. తనకేమీ కాలేదని, ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పిన చినరాజప్ప, ఆపై తన మిగతా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లిపోయారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను మీరూ చూడవచ్చు.

East Godavari District
Kakinada
Shuttle
Nimmakayala Chinarajappa
  • Error fetching data: Network response was not ok

More Telugu News