Hyderabad: ఒకరితో ప్రేమ పెళ్లి, మరొకరితో పెద్దలు కుదిర్చిన నిశ్చితార్థం... పోలీసు కేసు నమోదు!

  • బ్యూటీషియన్ స్రవంతిని ప్రేమించిన కారుడ్రైవర్ నరసింహ
  • గత నెల 2న యాదగిరిగుట్టలో ప్రేమ వివాహం
  • నెల రోజులు తిరగకముందే మొహం చాటేసిన నరసింహ
  • కేసును విచారిస్తున్నామన్న బంజారాహిల్స్ పోలీసులు

ప్రేమించానన్నాడు. నువ్వు లేకుండా నేను లేనన్నాడు. గత నెల 2వ తేదీన యాదగిరిగుట్టకు తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడు. కాపురం కూడా పెట్టాడు. ఇంతలో బుద్ధి గడ్డితింది. పెద్దలు కుదిర్చిన సంబంధమంటూ, మరో యువతితో నిశ్చితార్థానికి సిద్ధమైన ఆ యువకుడి అసలు స్వరూపాన్ని తెలుసుకున్న అమ్మాయి, పోలీసులను ఆశ్రయించింది.

హైదరాబాద్, బంజారాహిల్స్ పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ఫిల్మ్ నగర్ లో బ్యుటీషియన్ గా పనిచేస్తున్న స్రవంతి అనే యువతికి, అదే ప్రాంతానికి చెందిన కారు డ్రైవర్ నరసింహతో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చిన నరసింహ, యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకుని, ఆపై అద్దె ఇల్లు తీసుకుని కాపురం పెట్టాడు. నెల రోజులైనా గడవకముందే మొహం చాటేయడం ప్రారంభించాడు.

ఇంటికి రాని అతని గురించి స్రవంతి వాకబు చేయగా, మరో పెళ్లికి సిద్ధమయ్యాడన్న విషయం తెలిసింది. తనకు న్యాయం చేయాలంటూ ఆమె పోలీసులను ఆశ్రయించగా, నరసింహపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వేధింపుల చట్టంతో పాటు ఐపీసీలోని సెక్షన్ 417, 498 (ఎ) ప్రకారం కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు వెల్లడించారు.

Hyderabad
Banjarahills
Police
Love Marriage
Engagement
Beautisian
  • Loading...

More Telugu News