Telangana: పెళ్లయిన రెండో రోజే భర్త మిస్సింగ్.. పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు!

  • చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
  • యువతిని ప్రేమించి, పెళ్లాడిన సలీం
  • రెండో రోజే ఇంటి నుంచి వెళ్లిపోయిన వైనం

పెళ్లయిన రెండో రోజే భర్త ఇంటి నుంచి మాయమైపోయాడు. దీంతో సదరు యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన హైదరాబాద్ లోని చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

బండ్లగూడ నూరీనగర్‌ ప్రాంతంలో నివసించే సయ్యద్‌ సలీం (25) సెంట్రింగ్‌ పని చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన యాస్మినా బేగం, సలీం ఒకరినొకరు ఇష్టపడ్డారు. దీంతో ఇటీవల వీరిద్దరూ వివాహం చేసుకుని నూరీనగర్ లో కాపురం పెట్టారు.

అయితే పెళ్లయిన రెండో రోజే ‘నువ్వంటే నాకు ఇష్టం లేదు’ అని చెప్పి సలీం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బంధువులు, స్నేహితుల ఇళ్లలోనూ సలీం జాడ తెలియరాకపోవడంతో యాస్మినా పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Telangana
Hyderabad
chandrayana gutta
marriage
2nd day
missing
  • Loading...

More Telugu News