Bengalore: గురువు దేవెగౌడ, శిష్యుడు సిద్ధరామయ్య నిద్రిస్తున్న వేళ... వారినే గమనిస్తున్న కుమారస్వామి... వైరల్ అవుతున్న ఫొటో!

- బెంగళూరులో ఘటన
- గతంలో గురుశిష్యులుగా దేవెగౌడ, సిద్ధరామయ్య
- ఆపై కాంగ్రెస్ లో చేరి సీఎం అయిన సిద్ధరామయ్య
మాజీ ప్రధాని, కర్ణాటక మాజీ సీఎం దేవెగౌడకు మరో మాజీ సీఎం సిద్ధరామయ్య మంచి శిష్యుడన్న సంగతి అందరికీ తెలిసిందే. తొలుత జేడీయూలోనే కీలక నేతగా ఎదిగిన సిద్ధరామయ్య, ఆపై పార్టీ తీసుకున్న నిర్ణయాలను ఖండిస్తూ, సుమారు పన్నెండేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరి, సీఎంగానూ బాధ్యతలు నిర్వహించారు. ఇటీవలి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తరువాత జేడీయూ, కాంగ్రెస్ కలసి ప్రభుత్వాన్ని స్థాపించగా, దేవెగౌడ కుమారుడు కుమారస్వామిని సీఎం పీఠంపై కూర్చోబెట్టి, తాను కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు సిద్ధరామయ్య.
