Sabarimala: 50 ఏళ్ల లోపున్న మహిళ వచ్చిందని వదంతులు... శబరిమలలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత!

  • కుటుంబీకులతో కొండ ఎక్కిన మహిళ
  • వలియ నాదపండాల్ వద్ద అడ్డుకున్న భక్తులు
  • తన వయసు 50 దాటిందని నచ్చజెప్పిన మహిళ
  • శాంతించిన భక్తులు

10 నుంచి 50 సంవత్సరాల లోపు వయసున్న మహిళలను శబరిమలకు రానిచ్చేది లేదని భక్తులు భీష్మించుకుని కూర్చున్న వేళ, ఇప్పటికే ఆలయం వరకూ వచ్చిన యువతులు కొందరిని బలవంతంగా వెనక్కు పంపించిన సంగతి తెలిసిందే. ఇక శనివారం నాడు 50 ఏళ్ల లోపు వయసున్న ఓ మహిళ వచ్చారంటూ వదంతులు చెలరేగడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

ఆ నోటా, ఈ నోటా వార్తను విన్న భక్తులు, 'వలియ నాదపండాల్‌' వద్ద ఆమెను అడ్డుకున్నారు. కుటుంబీకులతో కలసి ఇరుముడి ధరించి వచ్చిన ఆమె, తన వయసు 50 ఏళ్లు దాటిందని చెబుతూ, భక్తులకు నచ్చజెప్పారు. ఆపై భక్తులు శాంతించడంతో ఆమె 18 బంగారు మెట్లను ఎక్కి స్వామిని దర్శించుకున్నారు. ఈ ఘటనపై స్పందించిన పథనంతిట్ట కలెక్టర్, ఆమెను కొన్ని టీవీ చానళ్లు వెంబడించడంతోనే ఈ ఘటన తలెత్తిందని అన్నారు.

Sabarimala
50 Years
Lady
Ayyappa
Piligrims
  • Loading...

More Telugu News