statue of liberty: ‘స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ’కి నిరసనల సెగ...పటేల్‌ విగహ్రావిష్కరణ రోజున గిరిజనుల ఉపవాస దీక్ష

  • 31న సహాయ నిరాకరణకు గిరిజన సంఘాల నిర్ణయం
  • వంట చేయకూడదని 72 గ్రామాల ప్రజలు ఏకాభిప్రాయం
  • 9 గిరిజన జిల్లా నుంచి ఆందోళనకారులు హాజరు

గుజరాత్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా భావిస్తున్న పటేల్‌ విగ్రహావిష్కరణకు గిరిజనుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నర్మదా నది తీరంలో ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే అతి పెద్దదైన సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ (స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ-ఐక్యతా విగ్రహం) విగ్రహాన్ని ఈనెల 31న ప్రధాని మోదీ ఆవిష్కరించనున్న విషయం తెలిసిందే. అయితే అదే రోజు సహాయ నిరాకరణ ఉద్యమం చేపడుతున్నామని, 75 వేల మంది గిరిజనులు ఈ నిరసనలో పాల్గొంటారని గిరిజన నేత డాక్టర్‌ ప్రపూల్‌ వసవ తెలిపారు.

ఈ భారీ ప్రాజెక్టు వల్ల 72 గ్రామాల్లోని వేలాది మంది గిరిజనులు జీవనాధారం కోల్పోతున్నారని, వారంతా ఆ రోజున వంట చేసుకోకుండా ఉపవాస దీక్ష చేయనున్నట్లు తెలిపారు. ‘సాధారణంగా గిరిజనులు ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే గ్రామాల్లో ఇలా వంట చేసుకోరు’ అని ప్రపూల్‌ తెలిపారు.

తమ సహాయ నిరాకరణ ఉద్యమానికి దేశవ్యాప్తంగా ఉన్న వంద గిరిజన సంఘాలు మద్దతు పలికాయని, తొమ్మిది గిరిజన జిల్లాల నుంచి ఆందోళనకారులు ఉద్యమంలో పాల్గొంటున్నారని ప్రపూల్‌ తెలిపారు. గిరిజన హక్కులను ప్రభుత్వం కాలరాస్తున్నందునే ఈ విధంగా నిరసన తెలియజేస్తున్నట్లు స్పష్టం చేశారు.

statue of liberty
Gujarath
girijan agitation
  • Loading...

More Telugu News