arjun: మీటూ.. సీనియర్ నటుడు అర్జున్ పై ఆరోపణలు చేసిన శృతి

  • రిహార్సల్స్ సమయంలో నన్ను హత్తుకున్నాడు
  • సీన్ ఇలా చేస్తే బాగుంటుందని దర్శకుడికి చెప్పాడు
  • ఒక నటి అనుమతి తీసుకోకుండా.. ఇలా చేయడం దారుణం

బాలీవుడ్ ను కుదిపేస్తున్న మీటూ ఉద్యమం కోలీవుడ్ లో కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే గీత రచయిత వైరముత్తుపై గాయని చిన్మయి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో, యాక్షన్ కింగ్ అర్జున్ పై నటి శృతి హరిహరన్ ఆరోపణలు గుప్పించింది.

'విస్మయ' అనే ద్విభాషా చిత్రంలో నటిస్తున్న సమయంలో తనను అర్జున్ హత్తుకున్నాడని శృతి ఆరోపించింది. ఓ రొమాంటిక్ సీన్ కోసం రిహార్సల్స్ చేస్తుండగా... చేతులను తన వీపుపై ఉంచి గట్టిగా హత్తుకుని, ఈ సీన్ ఇలా చేస్తే బాగుంటుందని దర్శకుడికి చెప్పాడని ఆమె తెలిపింది. ఒక నటి అనుమతి తీసుకోకుండా ఇలా చేయడం దారుణమని చెప్పింది. ఆ ఘటనతో షాక్ అయిన తాను, గట్టిగా విదిలించుకుని అక్కడ నుంచి బయటకు వచ్చేశానని ఫేస్ బుక్ ద్వారా తెలిపింది. సినిమా ప్రమోషన్స్ సమయంలో కూడా ఇలాగే ప్రవర్తించాడని ఆరోపించింది. శృతి ఆరోపణలపై అర్జున్ ఇంకా స్పందించాల్సి ఉంది.

arjun
sruthi
hariharan
kollywood
metoo
  • Loading...

More Telugu News