Rajinikanth: శబరిమల విషయంలో సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలి: రజనీకాంత్

  • శబరిమల ఆలయ సంప్రదాయాలను అందరూ గౌరవించాలి
  • మీటూ ఉద్యమం మహిళలకు చాలా మేలు చేస్తుంది
  • ఆ ఉద్యమాన్ని తప్పుగా వాడుకోరాదు

శబరిమల వివాదంపై ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ స్పందించారు. ఆలయంలో మహిళల ప్రవేశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించాలని అన్నారు. ఇదే సమయంలో ఆలయ సంప్రదాయాలు, ఆచారాలను అందరూ గౌరవించాలని తాను కోరుతున్నానని చెప్పారు. మహిళలు తమకు జరిగిన అన్యాయాలను ధైర్యంగా వెల్లడిస్తున్న మీటూ ఉద్యమానికి తాను మద్దతిస్తున్నానని తెలిపారు.

అయితే, దాన్ని తప్పుగా మాత్రం వాడుకోవద్దని చెప్పారు. మీటూ ఉద్యమం మహిళలకు ఎంతగానో సహాయపడుతుందని... వాళ్లు దాన్ని సరిగ్గా వాడుకోవాలని చెప్పారు. తమిళ గీత రచయిత వైరముత్తుపై గాయని చిన్మయి చేసిన ఆరోపణలపై స్పందిస్తూ... వైరముత్తు తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారని, చట్టపరంగా చర్యలు తీసుకుంటానని చెప్పారని అన్నారు. 

Rajinikanth
sabarimala
metoo
kollywood
  • Loading...

More Telugu News