nagarjuna: నాగార్జున నుంచి మరో మల్టీ స్టారర్ .. టైటిల్ ఖరారు

- తమిళంలో నాగ్ మల్టీ స్టారర్
- 'నాన్ రుద్రన్' గా టైటిల్ ఖరారు
- త్వరలో తెలుగు టైటిల్ ప్రకటన
మొదటి నుంచి కూడా నాగార్జున మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపిస్తూ వస్తున్నారు. ఇటీవల తెలుగులో మల్టీ స్టారర్ గా 'దేవదాస్' చేసిన ఆయన, ప్రస్తుతం హిందీలో ఒక మల్టీ స్టారర్ .. తమిళంలో మరో మల్టీ స్టారర్ చేస్తున్నారు. తమిళ సినిమా ధనుశ్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతోన్న ఈ సినిమాలో ఒక హీరోగా ధనుశ్ .. మరో హీరోగా నాగార్జున నటించనున్నారు.
