sabarimala: శబరిమల బేస్ క్యాంప్ లో 38 ఏళ్ల మహిళ.. పోలీస్ రక్షణతో కొండపైకి!

  • పంబా బేస్ కు చేరుకున్న మంజు
  • రక్షణ కల్పించాలంటూ పోలీసులకు విన్నపం
  • కేరళ దళిత మహిళ ఫెడరేషన్ కార్యదర్శిగా ఉన్న మంజు

ఓ వైపు నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నా... మరోవైపు శబరిమల ఆలయంలోకి వెళ్లేందుకు మహిళలు యత్నిస్తూనే ఉన్నారు. తాజాగా ఈరోజు 38 ఏళ్ల మంజు అనే మహిళ శబరిమల వెళ్లేందుకు పంబా బేస్ కు చేరుకున్నారు. కేరళ దళిత మహిళ ఫెడరేషన్ కు ఆమె కార్యదర్శిగా ఉన్నారు. శబరిమలకు వెళ్లే క్రమంలో తనకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆమె కోరారు. దీంతో, పోలీసుల సంరక్షణలో ఆమె కొండపైకి వెళ్లనున్నారు. ఒకవేళ ఆమె ఆలయంలోకి ప్రవేశిస్తే, చరిత్ర పుటల్లోకి ఎక్కుతారు. మరోవైపు శబరిమల కొండపై వర్షం కురుస్తుండడంతో మార్గమంతా బురదతో నిండిపోయింది. 

sabarimala
women
entry
pamba
  • Loading...

More Telugu News