shreya: సిగరెట్ తాగడం, మందు కొట్టడం వంటి సన్నివేశాలు ఇబ్బందిగా అనిపించాయి!: శ్రియ

  • సిగరెట్ తాగే విషయంలో మరింత ఇబ్బంది పడ్డా
  • గదంతా పొగతో నిండిపోవడంతో అందరం ఇబ్బందికి గురయ్యాము
  • ఇలాంటి సీన్లు చేయడం మామూలు విషయం కాదు

సక్సెస్ ఫుల్ గా తన కెరీర్ ను కొనసాగిస్తున్న శ్రియ... ప్రస్తుతం 'వీర భోగ వసంత రాయలు' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమెతో పాటు నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీవిష్ణులు నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. సినిమా ప్రమోషన్ ను కూడా యూనిట్ సభ్యులు ప్రారంభించారు.

ప్రమోషన్స్ లో భాగంగా శ్రియ మాట్లాడుతూ, తన కెరీర్ లో ఎన్నడూ చేయని ఓ విభిన్న పాత్రలో తాను కనిపించనున్నానని చెప్పింది. సిగరెట్ తాగడం, మందు కొట్టే సన్నివేశాల్లో నటించడం తనకు చాలా ఇబ్బంది అనిపించిందని తెలిపింది. సిగరెట్ తాగే విషయంలో మరింత ఇబ్బంది పడ్డానని... ఒక గదిలో ఈ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండటంతో... గదంతా పొగతో నిండిపోయిందని... గదిలో ఉన్నవారమంతా ఇబ్బంది పడ్డామని చెప్పింది. ఒక గదిలో ఇలాంటి సీన్ చేయడం మామూలు విషయం కాదని తెలిపింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News