rahul dravid: రాహుల్ ద్రవిడ్ ను ఇబ్బంది పెట్టిన యువతి.. ఇప్పుడు వెలుగు చూసిన వీడియో!

  • ద్రావిడ్ తో పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చిన యువతి
  • తన తండ్రి చేత ఒప్పించే ప్రయత్నం
  • చదువు, కెరీర్ పై దృష్టి సారించాలని హితవు పలికిన ద్రావిడ్

మీటూ ఉద్యమం సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇతర రంగాల్లోని ప్రముఖులను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, రాహుల్ ద్రవిడ్ కు చెందిన ఓ వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఓ హోటల్ గదిలో ద్రావిడ్ ఉన్నప్పుడు ఓ యువతి వచ్చింది. ద్రావిడ్ తో పెళ్లి ప్రస్తావనను తీసుకొచ్చింది. ద్రావిడ్ అందుకు నిరాకరించాడు.

ఇదే సమయంలో ఆమె మరింత ముందుకు వెళ్లేందుకు యత్నించింది. ద్రవిడ్ అక్కడ నుంచి లేచి, వెళ్లబోయాడు. దీంతో, బయట వేచి ఉన్న తన తండ్రిని పిలిచిన సదరు యువతి, ఆయన చేత పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేసింది. అయినా ద్రావిడ్ ఒప్పుకోలేదు. 20 ఏళ్ల వయసులో చదువు, కెరీర్ పై దృష్టి సారించాలని హితవు పలికాడు. ఇది ఎప్పుడు జరిగిందో సరైన సమాచారం లేనప్పటికీ... వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

rahul dravid
girl
marriage
proposal
video
  • Error fetching data: Network response was not ok

More Telugu News