Rahul Gandhi: రాహుల్ టూర్ కు ఆటంకం.. గంట ఆలస్యంగా మొదలుకానున్న తెలంగాణ పర్యటన!

  • మధ్యాహ్నం 1.30 గంటలకు భైంసా సభ
  • ఏర్పాట్లు పూర్తిచేసిన కాంగ్రెస్ శ్రేణులు
  • సాయంత్రం 6 గంటలకు చార్మినార్ వద్ద మరో సభ

తెలంగాణలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన గంట ఆలస్యంగా ప్రారంభం కానుంది. తొలుత ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు నిర్మల్ లోని భైంసాకు రాహుల్ చేరుకుంటారని చెప్పినప్పటికీ, సభను మధ్యాహ్నం 1.30 గంటలకు వాయిదా వేశారు. రాహుల్ ఢిల్లీ నుంచి నాందేడ్ కు విమానంలో చేరుకుంటారు. అనంతరం భైంసాకు ప్రత్యేక హెలికాప్టర్ లో వస్తారు.

భైంసా లో సభ తర్వాత మధ్యాహ్నం 3.30 గంటలకు కామారెడ్డిలో జరిగే బహిరంగ సభలో రాహుల్ పాల్గొంటారు. అనంతరం సాయంత్రం ఆరు గంటలకు రోడ్డుమార్గాన చార్మినార్ వద్దకు చేరుకుని అక్కడ జరిగే సభలో ప్రసంగిస్తారు.

చివరికి రాత్రి 7.40 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి రాహుల్ తిరుగుప్రయాణం కానున్నారు. కాగా, భైంసాతో పాటు కామారెడ్డిలో రాహుల్ సభలను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు పూర్తిచేశాయి. 

Rahul Gandhi
Congress
Telangana
tour
Hyderabad
Kamareddy District
bhaimsa
  • Loading...

More Telugu News