TRS: కూకట్ పల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే టార్గెట్ గా అభ్యంతరకర వీడియోలు.. నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు!

  • కూకట్ పల్లి మాజీ ఎమ్మెల్యే కృష్ణారావుకు వేధింపులు
  • పోలీసులను ఆశ్రయించిన నేత
  • నిందితుడిని కటకటాల వెనక్కునెట్టిన పోలీసులు

కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై సోషల్ మీడియాలో ఓ వ్యక్తి అసభ్యకరమైన వీడియోలు పోస్ట్ చేశాడు. దీంతో కృష్ణారావు పోలీసులను ఆశ్రయించగా, నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు.

మాధవరం కృష్ణారావును కించపరిచేలా హైదరాబాద్ లోని ప్రశాంతినగర్ కు చెందిన వ్యాపారి పొట్లూరు రమేశ్ బాబు వీడియోలు రూపొందించాడు. అనంతరం వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలు చివరికి మాధవరం కృష్ణారావు దృష్టికి వెళ్లాయి. ఈ నేపథ్యంలో ఆయన కూకట్ పల్లి పోలీసులను ఆశ్రయించారు.

తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. రంగంలోకి దిగిన పోలీసులు వ్యాపారి రమేశ్ బాబును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టు ముందు హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ కు తరలించాలని ఆదేశించింది.

TRS
madhavarm krishna rao
kukatpally
mla
Police
arrest
  • Loading...

More Telugu News