vijay: దుమ్మురేపేస్తోన్న 'సర్కార్' టీజర్ .. రికార్డు స్థాయిలో లైక్స్

- స్టైలిష్ లుక్ తో అదరగొట్టేసిన విజయ్
- యూట్యూబ్ లో దూసుకుపోతోన్న టీజర్
- దీపావళికి విడుదల
మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా 'సర్కార్' చిత్రం నిర్మితమైంది. కీర్తి సురేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రను పోషించింది. దీపావళి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి నిన్న ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. యాక్షన్ .. ఎమోషన్ తో కూడిన ఈ టీజర్లో విజయ్ చాలా స్టైలీష్ గా కనిపించాడు.
