Andhra Pradesh: గుంటూరు ఆలయంలో పురాతన వినాయక విగ్రహం చోరీ!

  • చిలకలూరిపేట మండలం మురికిపూడిలో ఘటన
  • మల్లేశ్వరస్వామి ఆలయంలోకి గోడదూకి ప్రవేశం
  • పోలీసులకు సమాచారం ఇచ్చిన పూజారి

గుంటూరు జిల్లాలో విగ్రహాల చోరీ ముఠా రెచ్చిపోయింది. ఓ ఆలయంలో ఉన్న పురాతన వినాయకుడి విగ్రహాన్ని పెకలించి తీసుకెళ్లింది. ఈ రోజు ఉదయం ఆలయాన్ని తెరిచిన పూజారి స్వామి విగ్రహం లేకపోవడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

జిల్లాలోని చిలకలూరిపేట మండలం, మురికిపూడి గ్రామంలో గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి ఆలయంలో చోరీ జరిగింది. నిన్ని అర్ధరాత్రి ఆలయంలోకి గోడదూకి ప్రవేశించిన దుండగులు, గడ్డపారలతో పురాతనమైన వినాయకుడి విగ్రహాన్ని పెకలించి తీసుకువెళ్లారు.

ఈ రోజు ఉదయం పూజలు నిర్వహించేందుకు ఆలయంలోకి వచ్చిన పూజారి ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అంతర్రాష్ట్ర విగ్రహాల చోరీ ముఠానే ఈ చోరీకి పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

Andhra Pradesh
Guntur District
temple
statue
effigy
stolen
Police
  • Loading...

More Telugu News