Thamanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో తమన్నా 'క్వీన్' 
  • చరణ్ సినిమాకి టైటిల్ అదేనట! 
  • 'యాత్ర' రిలీజ్ డేట్ ఖరారు

*  హిందీలో హిట్టయిన 'క్వీన్' చిత్రాన్ని తెలుగులో 'దటీజ్ మహాలక్ష్మి' పేరిట రీమేక్ చేస్తున్నారు. తమన్నా ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను నిర్వహిస్తున్నారు.
*  రామ్ చరణ్, బోయపాటి కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ ఈ దసరాకు వస్తుందని ఎదురుచూసిన అభిమానులకు నిరాశ ఎదురైంది. ఈ క్రమంలో ఈ ఫస్ట్ లుక్ ను దీపావళికి రిలీజ్ చేస్తారంటూ వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉంచితే, దీనికి 'వినయ విధేయ రామ' అనే టైటిల్ని ఖరారు చేసినట్టు తెలుస్తోంది.
*  మమ్ముట్టి ప్రధాన పాత్రధారిగా మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితకథగా తెరకెక్కుతున్న 'యాత్ర' చిత్రాన్ని డిసెంబర్ 21న విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఆ రోజున వైసీపీ అధినేత జగన్ జన్మదినం కావడం విశేషం.     

  • Error fetching data: Network response was not ok

More Telugu News