punjab: దసరా ఉత్సవాల్లో నెత్తుటి ఏర్లు.. పంజాబ్ లో జనాలపై నుంచి దూసుకెళ్లిన రైలు.. 50 మందికి పైగా మృతి.. వీడియో చూడండి!

  • అమృత్ సర్ లోని జోడా పాటక్ ప్రాంతంలో ఘోర ప్రమాదం
  • రావణ దహనాన్ని వీక్షిస్తున్న వారిపై నుంచి దూసుకెళ్లిన హవ్డా ఎక్స్ ప్రెస్
  • టపాకాయల పేలుడుకు రైలు శబ్దాన్ని వినలేకపోయిన జనం

పంజాబ్ లో దసరా ఉత్సవాల సందర్భంగా ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్ పక్కన నిల్చుని రావణ దహనాన్ని వీక్షిస్తున్న ప్రజలపై వేగంగా వచ్చిన హవ్డా ఎక్స్ ప్రెస్ దూసుకెళ్లింది. ఈ దారుణ ఘటనలో 50 మందికి పైగా ప్రాణాలు వదిలినట్టు ప్రాథమిక సమాచారం. అమృత్ సర్ లోని జోడా పాటక్ ప్రాంతంలో ఈ సాయంత్రం ప్రమాదం సంభవించింది. టపాకాయల పేలుడుకు రైలు వస్తున్న శబ్దాన్ని జనాలు వినలేకపోయారు. వేగంగా కదులుతున్న రైలును హఠాత్తుగా ఆపడం కూడా సాధ్యం కాదు. దీంతో, జనాలపై నుంచి రైలు వెళ్లిపోయింది.

50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ప్రమాద స్థలి నుంచి ప్రజలను ఖాళీ చేయిస్తున్నామని చెప్పారు. చనిపోయిన వారిలో పిల్లలు కూడా ఉన్నారు. ప్రమాదం సంభవించిన సమయంలో అక్కడ దాదాపు 700 మంది ఉన్నారు.

punjab
amritsar
rail
accident
dasara
ravan effigy
  • Error fetching data: Network response was not ok

More Telugu News