Kadiam Srihari: టీఆర్ఎస్ ను వదిలిపెట్టను.. నాకు ఆ ఆలోచనే లేదు: కడియం శ్రీహరి

  • మరో పార్టీలో చేరే అవకాశం లేదు
  • నాపై తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటా
  • టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను చూసి విపక్షాలు బెంబేలెత్తిపోతున్నాయి

తాను టీఆర్ఎస్ పార్టీని వీడి, మరో పార్టీలో చేరే అవకాశం లేదని మంత్రి కడియం శ్రీహరి అన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటానని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను చూసి విపక్షాలు బెంబేలెత్తిపోతున్నాయని అన్నారు. పూర్తి మేనిఫెస్టో చూస్తే విపక్షాల కళ్లు తిరగడం ఖాయమని చెప్పారు. తమది ప్రజల మేనిఫెస్టో అని అన్నారు. రానున్న 2, 3 ఏళ్లలో కాళేశ్వరం, దేవాదుల, పాలమూరు సీతారామా ప్రాజెక్టులను పూర్తి చేసి కోటి ఎకరాలకు నీరందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని చెప్పారు.

Kadiam Srihari
TRS
manifesto
  • Loading...

More Telugu News