lakshmis ntr: రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తే.. నేనూ తీస్తా: కేతిరెడ్డి

  • 'లక్ష్మీస్ వీరగ్రంధం' సినిమా తీయాలనుకుంటే చంద్రబాబు వద్దన్నారు
  • లక్ష్మీపార్వతి గురించి వర్మ అన్ని విషయాలను చూపిస్తారా?
  • ఏ బయోపిక్ లో కూడా వాస్తవాలను వర్మ చూపించలేదు

'లక్ష్మీస్ వీరగ్రంధం' సినిమాను తాను నిర్మించాలనుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దని చెప్పారని దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి చెప్పారు. చంద్రబాబు ఆనాడు ముఖ్యమంత్రి కావడానికి లక్ష్మీపార్వతే కారణమని తెలిపారు. వర్మ సినిమా తీస్తే... తాను కూడా సినిమా తీస్తానని చెప్పారు.

'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా గురించి తెలియదని లక్ష్మీపార్వతి చెప్పడం సరికాదని అన్నారు. ఈ సినిమాలో లక్ష్మీపార్వతి గురించి అన్ని విషయాలను వర్మ చెబుతారా? అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు వర్మ తీసిన బయోపిక్ లలో ఎక్కడా వాస్తవాలను చూపించలేదని ఎద్దేవా చేశారు. 

lakshmis ntr
lakshmis veeragrandham
Chandrababu
ram gopal varma
lakshmi parvathi
tollywood
  • Loading...

More Telugu News