sabarimala: శబరిమల కొండపైకి వచ్చా.. నేను గెలిచాను: హైదరాబాద్ పాత్రికేయురాలు కవిత

  • ఆలయంలోకి వెళ్లేందుకు యత్నించిన మహిళలు
  • 18 మెట్ల వద్ద అడ్డుకున్న భక్తులు
  • ఆలయంలోకి తీసుకెళ్లలేమని చెప్పిన అధికారులు

శబరిమల కొండపై ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఆలయంలోకి ప్రవేశించేందుకు కొందరు మహిళలు చేసిన ప్రయత్నాన్ని భక్తులు అడ్డుకున్నారు. వారికి భద్రతగా వచ్చిన పోలీసులను సైతం అడ్డుకున్నారు. దీంతో, బలవంతంగా ఆలయంలోకి తీసుకెళ్లలేమని అధికారులు వారికి చెప్పారు. ఈ నేపథ్యంలో, హైదరాబాదుకు చెందిన పాత్రికేయురాలు కవిత, సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమాలు అక్కడి నుంచి వెనుదిరిగారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, కొండపైకి రావడం సంతోషంగా, గర్వంగా ఉందని తెలిపారు. కొండపైకి వెళ్లే విషయంలో తాను గెలిచానని చెప్పగలనని అన్నారు. కొన్ని రోజుల తర్వాత తప్పకుండా మళ్లీ శబరిమలకు వస్తానని చెప్పారు. ఈ అంశంపై ఐజీ స్థాయి పోలీసు అధికారి మాట్లాడుతూ, మహిళలను ఆలయంలోకి వెళ్లకుండా భక్తులు అడ్డుకున్నారని.... ఆలయం తలుపులు మూసేస్తానని ఆలయ ప్రధాన పూజారి హెచ్చరించారని... దీంతో, మహిళలు అక్కడి నుంచి వెనుదిరిగారని చెప్పారు. 

sabarimala
women
entry
hyderabad
journalist
woman
kavitha
  • Loading...

More Telugu News