vijayakanth: చికిత్స కోసం అమెరికా వెళ్తున్న కెప్టెన్.. భార్యకు బాధ్యతల అప్పగింత

  • కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న విజయకాంత్
  • పార్టీ కోశాధికారిగా ప్రేమలతను నియమించిన కెప్టెన్
  • ఐదు వారాలు అమెరికాలో చికిత్స తీసుకోనున్న విజయకాంత్

డీఎండీకే పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు విజయకాంత్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అనారోగ్య కారణాలతో పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయన చురుకుగా పాల్గొనలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో తన భార్య ప్రేమలతకు ఆయన కొన్ని బాధ్యతలను అప్పగించారు. పార్టీ కోశాధికారిగా నియమించారు. కోశాధికారిగా ప్రేమలతను జిల్లాల కార్యదర్శులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

వాస్తవానికి పార్టీలో ఆమె ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. అయితే, అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి పదవి మాత్రం లేదు. తొలిసారి ఆమెకు అధికారికంగా పదవి లభించింది. ఈ సందర్భంగా ప్రేమలత మాట్లాడుతూ, చికిత్స కోసం విజయకాంత్ అమెరికాకు వెళ్తున్నారని చెప్పారు. ఐదు వారాల తర్వాత మళ్లీ వస్తారని తెలిపారు. విజయకాంత్ కుమారుడు విజయ ప్రభాకర్ కూడా రాజకీయాల్లోకి రానున్నట్లు ఈ నెల మొదట్లో విజయకాంత్ ప్రకటించారు. ఇప్పటికే ఆయన బావ సుధీష్ పార్టీ డిప్యూటీ కార్యదర్శిగా ఉన్నారు. 

vijayakanth
ill
dmdk
wife
premalatha
  • Loading...

More Telugu News