Uttar Pradesh: నూటొక్కమంది పిల్లలకు పాద పూజ చేసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి
- మహర్నవమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం
- కానుకల రూపంలో పుస్తకాలు, దక్షిణ పంపిణీ
- అంతకు ముందు మాతా సిద్ధధాత్రికి పూజలు
వినూత్న కార్యక్రమాలతో ఎప్పటికప్పుడు ప్రత్యేకత చాటుకునే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ మహర్నవమి సందర్భంగా నూటొక్కమంది బాలికల పాదాలు కడిగి వారి ఆశీర్వచనాలు అందుకున్నారు. తొలుత మాతా సిద్ధదాత్రికి పూజలు చేసిన ముఖ్యమంత్రి అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహర్నవమి సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి చిన్నారులకు కానుకల రూపంలో పుస్తకాలు, ఇతర బహుమతులు అందించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ శరన్నవరాత్రుల్లో కుమారి పూజకు ఎంతో ప్రాధాన్యం ఉందని అన్నారు. 'మహిళ' శక్తి స్వరూపిణి అని, ఆమె ఏ రూపంలో ఉన్నా తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మనదని అన్నారు. కాగా, గోరక్‌పూర్‌లోని మానస సరోవర్ రామ్‌లీలా మైదానంలో జరిగే రావణ వథ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ రోజు పాల్గొననున్నారు.