Guntur: నిన్న పదవి... నేడు మరణించిన టీడీపీ సీనియర్ నేత ఏడుకొండలు!

  • గుంటూరు మిర్చి యార్డు వైస్ చైర్మన్ గా చంద్రగిరి ఏడుకొండలు
  • నిన్న ఉదయం నియామకాన్ని ఖరారు చేసిన టీడీపీ
  • అర్థరాత్రి తరువాత గుండెపోటుతో మృతి

గుంటూరు మిర్చియార్డుకు వైస్ చైర్మన్ గా గురువారం నాడు నియమించబడిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చంద్రగిరి ఏడుకొండలు మరణించారు. నిన్న ఉదయం ఆయన్ను నియమిస్తున్నట్టు టీడీపీ అధిష్ఠానం ప్రకటించగా, అర్ధరాత్రి తరువాత గుండెపోటు వచ్చి ఆయన మరణించినట్టు తెలుస్తోంది. కొంతకాలంగా రాష్ట్ర వడ్డెర సంఘానికి ఉపాధ్యక్షుడిగా కూడా ఆయన సేవలందిస్తున్నారు.

ఏడుకొండలు మరణ వార్త తెలుసుకున్న సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేశ్, కళా వెంకట్రావు, స్పీకర్ కోడెల శివప్రసాద్ తదితరులు సంతాపాన్ని తెలియజేశారు. ఏడుకొండలు మరణం గుంటూరు ప్రాంతంలో టీడీపీకి తీరనిలోటని, ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబం ధైర్యంగా ఉండాలని అన్నారు.

Guntur
Mirchi Yard
Chandragiri Edukondalu
Died
Heart Attack
  • Loading...

More Telugu News