Police: మిన్నంటిన నిరసనలు... శబరిమల పోలీసు కార్యాలయంలోకి కవిత, రేహ్నా తరలింపు!

  • ఒక్క అడుగు కూడా వెయ్యలేకపోయిన పోలీసులు
  • వారిద్దరితో మాట్లాడుతున్న ఐజీ శ్రీజిత్
  • దర్శనం కావాల్సిందేనని పట్టుబడుతున్న యువతులు

అతివలు, అయ్యప్ప... మధ్య 200 మీటర్ల దూరం. పదినిమిషాల్లో స్వామి దర్శనం. కానీ మధ్యలో భక్త సముద్రం అడ్డు. సుమారు 20 వేల మంది అయ్యప్ప భక్తులు అడ్డుగా నిలబడి, పోలీసులను ముందుకు ఒక్క అడుగుకూడా కదలనీయని వేళ, అంతవరకూ రక్షణగా వచ్చిన పోలీసులు, ఇద్దరు యువతులనూ శబరిమలలోని పోలీసు కార్యాలయంలోకి తరలించారు. అక్కడ వారిద్దరితో ఐజీ శ్రీజిత్ మాట్లాడుతున్నారని తెలుస్తోంది.

ఇంతమంది భక్తుల నిరసనల నడుమ తాము ఆలయానికి వారిని చేర్చలేమని ఇద్దరు యువతులకూ శ్రీజిత్ నచ్చజెపుతున్నట్టు సమాచారం. కాగా, తమకు అయ్యప్ప దర్శనం చేయించాలని వారిద్దరూ పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది.

Police
Sabarimala
Ayyappa
Ladies
  • Error fetching data: Network response was not ok

More Telugu News