Jio: ఏడాది పాటు ఉచితం... జియో దీపావళి బంపరాఫర్!

  • జియో ప్రత్యేక దీపావళి స్పెషల్ యాన్యువల్ ప్లాన్
  • రూ. 1,699కి ఏడాదంతా ఉచిత కాల్స్
  • రోజుకు 100 ఎస్ఎంఎస్, 1.5 జీబీ డేటా
  • ఓచర్ రూపంలో రూ. 1,699 క్యాష్ బ్యాక్ కూడా

దసరా - దీపావళి పండగ సీజన్ లో ఈ-కామర్స్ సంస్థలు పలు రకాల డిస్కౌంట్లు, ఆఫర్ లను ప్రకటిస్తున్న వేళ, రిలయన్స్ జియో ప్రత్యేక దీపావళి స్పెషల్ యాన్యువల్ ప్లాన్ ను ప్రకటించింది. వచ్చే సంవత్సరం దీపావళి వరకూ అన్ని రకాల ఉచిత ప్రయోజనాలకు దగ్గర కావాలంటే రూ. 1,699తో రీచార్జ్ చేసుకుంటే సరిపోతుందని తెలిపింది.

ఇందులో భాగంగా ఉచిత లోకల్, నేషనల్ కాల్స్, అపరిమిత రోమింగ్ తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్ లు, రోజుకు 1.5 గిగాబైట్ డేటా చొప్పున 547.5 జీబీ డేటాను అందిస్తామని తెలిపింది. నవంబర్ 30లోగా ఈ స్కీమ్ లోకి ప్రవేశిస్తే 100 శాతం క్యాష్ బ్యాక్ కూడా ఇస్తామని తెలిపింది.

రిలయన్స్ డిజిటల్ ఎక్స్ ప్రెస్ మినీ స్టోర్లలో లేదా రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో రూ. 5 వేలకు పైగా షాపింగ్ చేసి, ఈ క్యాష్ బ్యాక్ ను వాడుకోవచ్చని, షరతులు వర్తిస్తాయని తెలిపింది. రెండు ఓచర్లను కలిపి వాడుకునేందుకు వీలుండదని, డిసెంబర్ 31లోగా ఓచర్ ను వాడుకోవాలని సూచించింది.

Jio
Reliance
Devali
Offer
  • Loading...

More Telugu News