Allu Arjun: దసరా సందర్భంగా అత్తగారింట్లో సందడి చేసిన అల్లు అర్జున్

  • భార్య స్నేహారెడ్డి అమ్మమ్మ ఇంటికి వెళ్లిన బన్నీ
  • కుటుంబ సమేతంగా చింతపల్లిలో సందడి
  • బన్నీని చూసేందుకు ఎగబడ్డ గ్రామస్తులు

దసరా పండుగ సందర్భంగా సిటీని వదిలి పెట్టి అత్తగారింటికి వెళ్లాడు హీరో అల్లు అర్జున్. తన భార్య స్నేహారెడ్డి అమ్మమ్మ స్వగ్రామమైన నల్గొండ జిల్లా పెద్దవూర మండలం చింతపల్లి గ్రామానికి వెళ్లాడు. కుటుంబ సమేతంగా వెళ్లి, సందడి చేశాడు. తమ ఊరికి అల్లు అర్జున్ వచ్చాడని తెలియడంతో ఆయన అత్తగారి ఇంటి వద్ద సందడి నెలకొంది. అల్లు అర్జున్ ను చూసేందుకు గ్రామమంతా తరలి వచ్చారు. సెల్పీలు, ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. తనకు దసరా శుభాకాంక్షలు చెప్పినవారందరికీ అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపాడు.

Allu Arjun
sneha reddy
tollywood
  • Loading...

More Telugu News