bjp: తెలంగాణలో బీజేపీ లేదు.. ఈ సారి కేంద్రంలో కూడా అధికారంలోకి రాదు: విజయశాంతి
- రాష్ట్రంలో బీజేపీ కనుమరుగు అయింది
- కాంగ్రెస్ కు టీఆర్ఎస్ తోనే పోటీ
- రాష్ట్రాన్ని దోచుకున్న పార్టీ టీఆర్ఎస్
ఒకప్పుడు తెలంగాణలో బీజేపీకి కొంత వరకు ప్రజల మద్దతు ఉండేదని... ఇప్పుడు రాష్ట్రంలో ఆ పార్టీ కనుమరుగు అయిందని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి అన్నారు. కేంద్రంలో కూడా ఆ పార్టీ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు. ఎన్డీయే ప్రభుత్వ వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోయాయని చెప్పారు. సామాన్యులు బతికే పరిస్థితి దేశంలో లేదని అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ టార్గెట్ టీఆర్ఎస్ మాత్రమేనని విజయశాంతి చెప్పారు. ప్రజలను మోసం చేస్తూ, రాష్ట్రాన్ని దోచుకున్న పార్టీ టీఆర్ఎస్ అని విమర్శించారు. టీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని అన్నారు.