janasena: జనసేనలో చేరిన టీడీపీ నేత చదలవాడ

  • శ్రీకాకుళం జిల్లాలో పవన్ సమక్షంలో జనసేనలో చేరిక
  • సాదరంగా ఆహ్వానించిన పవన్
  • గత కొంత కాలంగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న చదలవాడ

తెలుగుదేశం పార్టీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి జనసేనలో చేరారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. తుపాను బాధితులను పరామర్శించేందుకు శ్రీకాకుళం జిల్లాలో పవన్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చదలవాడ కూడా అక్కడకు వెళ్లారు. చదవవాడకు పార్టీ కండువా కప్పి పవన్ సాదరంగా ఆహ్వానించారు. గత వారమే మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా జనసేనలో చేరిన సంగతి తెలిసిందే.

1999లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో చదలవాడ టీడీపీలో చేరారు. ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ ఛైర్మన్ గా ప్రభుత్వం నియమించింది. ఈ పదవీకాలం ముగిసిన తర్వాత... పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉన్నారు. ఈరోజు జనసేనలో చేరారు.

janasena
Pawan Kalyan
chadalavada krishnamurthy
Telugudesam
  • Loading...

More Telugu News