Hyderabad: ఫేస్ బుక్ పరిచయంతో అమ్మాయిని హోటల్ కు తీసుకెళ్లి అసభ్య ప్రవర్తన... సోషల్ మీడియాలో దృశ్యాలు!

  • మైలవరం యువతితో మణికంఠకు పరిచయం
  • హోటల్ కు అహ్వానించగా, వెళ్లిన యువతి
  • లైంగిక వేధింపులకు పాల్పడ్డ మిత్రత్రయం
  • అత్యాచారం జరగలేదని పోలీసులకు చెప్పిన యువతి

ఫేస్ బుక్ లో తనకు పరిచయమైన ఓ అమ్మాయిని హోటల్ కు ఆహ్వానించిన ఓ యువకుడు, తన స్నేహితులతో కలసి ఆమెపై అసభ్యంగా ప్రవర్తించి, ఆ ఘటనను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, మైలవరంలోని ఓ కాలేజీలో చదువుకుంటున్న ఓ అమ్మాయికి ఇబ్రహీంపట్నంకు చెందిన ఓ యువకుడితో ఫేస్‌ బుక్‌ ద్వారా పరిచయం ఏర్పడింది.

ఈ క్రమంలో ఈ నెల 11న ఇబ్రహీంపట్నంలో ఉన్న కేవీఆర్‌ గ్రాండ్‌ హోటల్‌ లో రూమును బుక్‌ చేసుకున్న యువకుడు, ఆ అమ్మాయిని హోటల్ కు ఆహ్వానించి, కారులో ఆమెను రప్పించాడు. వారిద్దరూ గదిలో ఉన్న సమయంలో అతని మరో ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు. ముగ్గురూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, ఆ దృశ్యాలను మొబైల్ ఫోన్లలో షూట్ చేశారు. ఆపై ఆమె అక్కడి నుంచి తప్పించుకుని బయటపడింది.

ఆమె వెళ్లిపోయిన తరువాత, బ్లాక్ మెయిల్ కు దిగిన ఫ్రెండ్, డబ్బులు ఇవ్వకుంటే, సదరు వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. శాంపిల్ గా కొన్ని దృశ్యాలను పెట్టారు కూడా. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసి, విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురినీ అరెస్ట్ చేశారు.

ఈ ఘటనలో తనపై రేప్, జరగలేదని, మణికంఠ అనే స్నేహితుడితో లాడ్జికి వెళ్లానని, అక్కడ తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తే పారిపోయానని ఆమె ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. నిందితులపై అత్యాచారయత్నం అభియోగాలను మోపిన పోలీసులు కేసు దర్యాఫ్తు చేస్తున్నారు.

Hyderabad
Police
Mylavaram
Friends
Facebook
Hotel
Social Media
  • Loading...

More Telugu News