Maharashtra: మందుకొట్టి ఎయిర్ హోస్టెస్ కు వేధింపులు.. కటకటాల వెనక్కు నెట్టిన పోలీసులు!

  • ఇండిగో విమానంలో యువతికి వేధింపులు
  • ఉన్నతాధికారులకు ఫిర్యాదు 
  • అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిన పోలీసులు

ఓ విమాన ప్రయాణికుడు ఎయిర్ హోస్టెస్ తో అసభ్యంగా ప్రవర్తించాడు. పూటుగా మందు కొట్టి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో సదరు ప్రబుద్ధుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, చివరికి కటకటాల వెనక్కు నెట్టారు.

కర్ణాటకకు చెందిన రాజు గంగప్ప ముంబై నుంచి బెంగళూరుకు ఇండిగో విమానంలో బయలుదేరాడు. అయితే పూటుగా మద్యం సేవించిన గంగప్ప విమానంలో విధులు నిర్వహిస్తున్న ఎయిర్ హోస్టెస్(20)ను లైంగికంగా వేధించాడు.

దీంతో బాధితురాలు ఈ విషయాన్ని పైలెట్ కు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో విమానం టేకాఫ్ కాకముందే గంగప్పను ఎయిర్ పోర్ట్, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు.

Maharashtra
Karnataka
indigo
sexual harrasment
mumbai
  • Loading...

More Telugu News