Talking Movies: ‘మీ టూ’ ఉద్యమం.. హీరోయిన్ కు అండగా నిలిచిన సిద్ధార్థ్.. బెదిరిస్తూ ఫోన్ చేసిన దర్శకుడు!

  • నటి లీనాకు దర్శకుడు సుశి గణేశన్ వేధింపులు
  • మీటూలో భాగంగా బయటపెట్టిన హీరోయిన్
  • పూర్తి మద్దతు ఇస్తానని ప్రకటించిన సిద్ధార్థ్

భారత్ లో సినిమా, రాజకీయ, మీడియా రంగాల్లో లైంగిక వేధింపులపై మొదలైన ‘మీ టూ’ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో తమిళ నటి లీనా మణిమేఖలై కూడా ముందుకొచ్చింది. దర్శకుడు సుశి గణేశన్ తనను తీవ్రంగా వేధించాడని లీనా చెప్పింది. ఓసారి తనను కారులో ఉంచి లాక్ చేసేశాడని వెల్లడించింది. తనకు మరికొందరు అండగా నిలుస్తారని ఆశిస్తున్నట్లు ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది.

దీంతో లీనాకు మద్దతుగా హీరో సిద్ధార్థ్ మాట్లాడాడు. ‘నీ గళం అందరికీ వినిపిస్తుంది. నీ ధైర్యం ఆదర్శవంతం’ అని ట్వీట్ చేశాడు. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి లోనయిన దర్శకుడు సుశి గణేశన్ సిద్ధార్థ్ తండ్రికి ఫోన్ చేసి బెదిరించాడట. ఈ వ్యవహారం నుంచి సిద్ధార్థ్ తప్పుకోకుంటే తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న సిద్ధార్థ్.. ట్విట్టర్ లో స్పందించాడు.

ఇప్పటికైనా సుశి గణేశన్ గురించి అందరూ తెలుసుకోవాలని వ్యాఖ్యానించాడు. లీనాకు తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపాడు. ఈ మేరకు సిద్ధార్థ్ మరోసారి ట్వీట్ చేశాడు.

Talking Movies
cinema
siddarth
me too
susi ganeshan
leena manimekhali
  • Loading...

More Telugu News