Newyork Times: శబరిమలకు వచ్చిన న్యూయార్క్ టైమ్స్ రిపోర్టర్ సుహాసినీ రాజ్... రాళ్లు విసిరి తరిమిన నిరసనకారులు!

  • శబరిమలకు వచ్చిన రిపోర్టర్
  • స్వామి దర్శనానికి కాదని చెప్పినా వినిపించుకోని నిరసనకారులు
  • చేసేదేమీలేక వెనుదిరిగిన సుహాసినీ రాజ్

న్యూఢిల్లీకి చెందిన న్యూయార్క్ టైమ్స్ రిపోర్టర్ సుహాసినీ రాజ్, శబరిమలకు వెళ్లాలన్న ప్రయత్నం విఫలమైంది. ఆమెను అడ్డుకున్న నిరసనకారులు, రాళ్లను విసిరి తరిమారు. తన సహచరుడైన ఓ విదేశీయుడితో కలసి ఆమె పంబ గేట్ వేను దాటుతున్న సమయంలో పెద్దఎత్తున నిరసనకారులు, ముఖ్యంగా మహిళలు ఆమెను అడ్డుకున్నారు. అప్పటివరకూ సుహాసినీకి రక్షణగా వచ్చిన పోలీసులు సైతం చేతులెత్తేయడంతో, వారిద్దరూ అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది.

ఇక ఆమె నడుస్తున్నంత సేపూ, తాను దేవుని దర్శించుకునేందుకు రావడం లేదని, కేవలం రిపోర్టింగ్ చేయడానికి మాత్రమే వచ్చానని అమె చెబుతున్నా, నిరసనకారులు ఎవరూ వినలేదు. "భక్తులు ఆమె రాకను తీవ్రంగా వ్యతిరేకించారు. మార్గమధ్యంలో కూర్చుని నినాదాలు చేశారు. రాళ్లు విసిరారు. ఇక ఆమెకు వెనుదిరగడం మినహా మరో మార్గం కనిపించలేదు" అని ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పారు. కాగా, శబరిమలలో నిన్న గర్భగుడి తలుపులు తెరచుకోగా, ఇంతవరకూ నిషేధిత వయసులో ఉన్న ఏ మహిళా స్వామిని దర్శించుకోలేదు.

Newyork Times
Suhasini Raj
Sabarimala
Pampa
  • Loading...

More Telugu News