petrol: పెట్రోలు, డీజిల్ ధరల్లో తగ్గుదల!

  • 21 పైసలు లీటరు పెట్రోలు ధర
  • డీజిల్ ధరలో 11 పైసలు తగ్గుదల
  • ముంబైలో రూ. 88.08కి పెట్రోలు ధర

ఎట్టకేలకు ఈ రోజు పెట్రోలు, డీజిల్ ధరల్లో తగ్గుదల నమోదైంది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న ధరలు దసరా నాడు స్వల్పంగా తగ్గాయి. లీటరు పెట్రోలుపై 21 పైసలు, డీజిల్ పై 11 పైసల మేరకు ధరను తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రకటించాయి. ధరల సవరణ తరువాత న్యూఢిల్లీలో పెట్రోలు రూ. 82.62కు డీజిల్ 75.58కి చేరుకోగా, ముంబైలో పెట్రోలు లీటరుకు రూ. 88.08, డీజిల్ 79.24కు చేరాయి. ఇక విజయవాడలో పెట్రోలు రూ. 86.83కు, డీజిల్ రూ. 81.06కు, గుంటూరులో పెట్రోలు రూ. 87.03, డీజిల్ రూ. 81.26కు తగ్గాయి.

petrol
Diesel
Price Hike
Price Slash
  • Loading...

More Telugu News