Chandrababu: మహిషాసురుడుకి, చంద్రబాబుకి పోలికలు ఉన్నాయి: వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు

  • చంద్రబాబు పాలన మహిషాసురుడి పాలనలా ఉంది
  • ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘నారా సురుడు’
  • ఆయన ఎక్కడ అడుగుపెడితే అక్కడ కరవుకాటకాలే

రాక్షసుడు మహిషాసురుడికి, మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి పోలికలు ఉన్నాయంటూ వైసీపీ అధినేత జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో నిర్వహిస్తున్న బహిరంగసభలో జగన్ మాట్లాడుతూ, రాక్షసుడు మహిషా సురుడు అయితే మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘నారా సురుడు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో చంద్రబాబు పాలన మహిషాసురుడి పాలనలా ఉందని, ఆయన ఎక్కడ అడుగుపెడితే అక్కడ కరవుకాటకాలేనని విమర్శించారు. పొదుపు సంఘాలకు ఒక్క రూపాయి కూడా రుణ మాఫీ చేయలేదని, రుణమాఫీ పేరిట మహిళలను దగా చేశారని ఆరోపించారు. ఈ విధంగా మోసం చేస్తున్న చంద్రబాబును ‘నారా సురుడు’ అనాలా? 420 అనాలా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Chandrababu
jagan
vijayanagaram
YSRCP
  • Loading...

More Telugu News