Pawan Kalyan: పవన్ కల్యాణ్ మానసిక పరిస్థితి సరిగా లేదు: వైసీపీ నేత ఆళ్ల నాని

  • జగన్ ని ఫ్యాక్షనిస్టుగా చిత్రీకరించాలని చూస్తున్నారు
  • పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి
  • లేకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు

వైసీపీ అధినేత జగన్ ని ఫ్యాక్షనిస్టుగా చిత్రీకరించాలని చూస్తున్న ‘జనసేన’ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ మానసిక పరిస్థితి సరిగా లేదని ఎమ్మెల్సీ ఆళ్ల నాని విమర్శించారు. పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని హితవు పలికారు. అసత్య ఆరోపణలు చేయడం మానుకోకపోతే ‘జనసేన’కు, పవన్ కల్యాణ్ కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం పోరాడుతున్నానని చెబుతున్న పవన్ ఏనాడైనా ఢిల్లీ వెళ్లి ఉద్యమం చేశారా? అని ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు తనను పిలవలేదు కనుక తాను వెళ్లలేదన్న పవన్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు.  

Pawan Kalyan
jana sena
alla nani
YSRCP
  • Loading...

More Telugu News