jana sena: భారీ కవాతు చేపట్టిన ‘జనసేన’ ఏం సాధించింది?: మంత్రి గంటా

  • గర్జించేందుకే పార్టీ పెట్టానని పవన్ అంటున్నారు
  • అన్యాయం చేస్తున్న కేంద్రంపై ఎందుకు గర్జించరు?
  • ఎవరో చెప్పింది విని మాట్లాడటం కాదు

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి గంటా విరుచుకుపడ్డారు. శ్రీకాకుళంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని, ప్రజాసేవ చేయాలనుకుంటే పవన్ వైఖరేంటో తెలపాలని డిమాండ్ చేశారు. ఎవరో చెప్పింది విని, కాగితాలు అందిస్తే చదవడం కాదని పవన్ పై విమర్శలు చేశారు. భారీ కవాతు చేపట్టిన ‘జనసేన’ ఏం సాధించింది? గర్జించేందుకే పార్టీ పెట్టానంటున్న పవన్, ఏపీకి అన్యాయం చేస్తున్న కేంద్రంపై ఎందుకు గర్జించడం లేదు? అని ప్రశ్నించారు.

jana sena
Pawan Kalyan
minister
Ganta Srinivasa Rao
  • Loading...

More Telugu News